సబ్జా గింజలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


వేసవిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. సబ్జా గింజలు నీటిలో వాటి పొడి బరువు నాలుగు రెట్లు వరకు  పెంచుకుంటాయి. వాటి చుట్టూ జల్లి లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఈ హైడ్రోజెల్ ప్రాథమికంగా ఎలక్ట్రోలైట్స్ నీటికీ మూలం. ఇది వేసవి చెమట సమయంలో మీరు కోల్పోయిన అన్ని పోషకాలను పునరుద్ధరిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం సబ్జా గింజలు మీ ప్రేగులపై జీర్ణ క్రియ తర్వాత ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఎండాకాలంలో వేడి, అధిక సూర్యరశ్మి, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా ఇది ప్రేగు కదలికలలో సమస్యలను కలిగిస్తుంది. అలాగే ఈ సమయంలో ఎక్కువగా ఎసిడిటీ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సబ్జా విత్తనాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యలను నుంచి ఉపశమనం పొందవచ్చు. సబ్జా గింజల లో విటమిన్ ఇ, క్రోమియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి మధుమేహన్ని అదుపు చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సబ్జా గింజలు ఆకలిని అణిచి వేస్తాయి. దీని వల్ల సులభంగా అధిక బరువును దూరం చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ కంటెంట్ కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అలాగే ఎండాకాలంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్యగా ఉంటుంది. కానీ సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడి మలబద్ధకాన్ని సులభంగా దూరం చేస్తుంది.  

Post a Comment

0Comments

Post a Comment (0)