సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. దీంతో ముగ్గురు ఎస్పీలు గురువాం సీఈవో మీనా ఎదుట హాజరయ్యారు. అసలు ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? విచారణలో ఏం తేలింది? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు? అనే అంశాలపై వారి నుంచి వివరణ తీసుకున్నట్టు సమాచారం. ఎస్పీలు ఇచ్చిన సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఇప్పటికే ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)