పెరిగిన బంగారం ధరలు !

Telugu Lo Computer
0


ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరుకున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల ప్రకటన తర్వాత ఊహించని రీతిలో బంగారం ధరలు నేడు పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నేడు ధర రూ.10,000 పెరిగి షాక్ ఇచ్చింది. దీంతో భారతీయ పసిడి ప్రియులు దేశంలోని వివిధ నగరాల్లో తాజా ధరలను ట్రాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేట్లను పరిశీలిస్తే 10 గ్రాములకు చెన్నైలో రూ.62,350, ముంబైలో రూ.61,800, ఢిల్లీలో రూ.61,950, కలకత్తాలో రూ.61,800, కేరళలో రూ.61,800, వడోదరలో రూ.61,850, మంగళూరులో రూ.61,800, నాశిక్ లో రూ.61,830, అయోధ్యలో రూ.61,950, బళ్లారిలో రూ.61,800, నోయిడాలో రూ.61,950, గురుగ్రాములో రూ.61,950 వద్ద కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.10,900 వృద్ధిని నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. 10 గ్రాముల ధర రూ.70 వేల మార్కుకు అతి చేరువలో కొనసాగుతోంది. ఈ క్రమంలో చెన్నైలో రూ.68,020, ముంబైలో రూ.67,420, దిల్లీలో రూ.67,570, కలకత్తాలో రూ.67,420, కేరళలో రూ.67,420, వడోదరలో రూ.67,470, మంగళూరులో రూ.67,420, నాశిక్ లో రూ.67,450, అయోధ్యలో రూ.67,570, బళ్లారిలో రూ.67,420, నోయిడాలో రూ.67,570, గురుగ్రాములో రూ.67,570 వద్ద ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.61,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.67,420 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1,500 పెరిగి రూ.81,500 వద్ద కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)