నాలుగు వైన్స్ షాపులపై దాడి చేసిన మహిళలు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం - ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులోకి లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని మహిళలు, స్థానికులు ఆగ్రహించారు. ఒక్కో బాటిల్‌పై రూ. 20 నుంచి రూ. 30 అధికంగా వసూలు చేస్తున్నారని ఒకేసారి నాలుగు వైన్ షాపులపై దాడి చేశారు. మద్యం స్టాక్‌ను మహిళలు, గ్రామస్తులు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం మహిళలు మద్యం షాపు నుంచి లిక్కర్ తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)