శాసన మండలికి నితీశ్ కుమార్, రబ్రీ దేవి ఏకగ్రీవ ఎన్నిక !

Telugu Lo Computer
0


బీహార్‌లో శాసన మండలి ఎన్నికల్లో ఓటింగ్ జరగకుండానే మొత్తం 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో 11 స్థానాలు ఖాళీ కాగా ఇందులో, ఎన్‌డీఏకు చెందిన ఆరుగురు అభ్యర్థులు, మహాకూటమికి చెందిన ఐదుగురు అభ్యర్థులు మినహా.. 12వ పోటీదారు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సీఎం నితీశ్‌ కుమార్‌ తన సహచరులతో కలిసి సభకు చేరుకున్నారు. అదే సమయంలో ఎన్డీయే తరపున ముగ్గురు బీజేపీ అభ్యర్థులు మంగళ్ పాండే, అనామికా సింగ్, లాల్ మోహన్ గుప్తాలను శాసనమండలికి పంపారు. కాగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో పాటు జేడీయూ నుంచి ఖలీద్‌ అన్వర్‌, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హమ్‌)కు చెందిన సంతోష్‌ కుమార్‌ సుమన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, మహాకూటమి నుంచి రబ్రీ దేవితో పాటు, ఆర్జేడీ నుంచి అబ్దుల్ బారీ సిద్ధిఖీ, ఎంఎల్ నుంచి డాక్టర్ ఊర్మిళా ఠాకూర్, సయ్యద్ ఫైసల్ అలీ, శశి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)