ఇంగువ - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ఇంగువను ఎక్కువగా సాంబారు, పప్పు కూరలలో మంచి వాసన, రుచి కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇంగువు అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. దీనిలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంగువను ప్రతి రోజూ  వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి చాలామంచిది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణంతో బాధపడుతున్నట్లయితే చిటికెడు ఇంగువను నీటిలో కలిపి తీసుకంటే చాలు. ఇంగువలో ఉండే గుణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతుంటే ఇంగువ వాడటం వల్ల సమస్యను అధిగమించవచ్చు. దగ్గుతో బాధపడేవారికి ఇంగువ మంచి పరిష్కారం చూపుతుంది. ఇంగువలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది దగ్గు లక్షణాలను తగ్గించడంలో సాయపడుతుంది. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ మీకు దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో సాయపడుతాయి. పంటి నొప్పితో బాధపడుతుంటే ఇంగువను కొద్దిగా వేడిచేసి నొప్పి ఉన్న పంటిపై పెట్టాలి. ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)