లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు !

Telugu Lo Computer
0


పీఎల్-2024లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 20 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు విజయ దుందుభి మోగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ 24, బట్లర్ 11, శాంసన్ 82 (నాటౌట్), పరాగ్ 43, హెట్మర్ 5, ధ్రువ్ 20 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు స్కోరు 20 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 193గా నమోదైంది. లక్నో బ్యాటర్లలో డికాక్ 4, కేఎల్ రాహుల్ 58, పడిక్కల్ 0, ఆయుష్ 1, దీపక్ హూడా 26, పూరణ్ 64 (నాటౌట్), స్టోయినిస్ 3, కృనాల్ పాండ్యా 3(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో జట్టు స్కోరు 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 173గా నమోదైంది.


Post a Comment

0Comments

Post a Comment (0)