వాట్సాప్‌ గ్రూప్‌లో చేరిన రూ.64 లక్షలు కోల్పోయిన యువకుడు ?

Telugu Lo Computer
0


వాట్సాప్‌ గ్రూప్‌లో చేరిన ఓ యువకుడు ఏకంగా రూ.64 లక్షల కోల్పోయాడు. ఓ యువకుడు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కొందరి సలహా మేరకు స్టాక్‌ ఎక్స్చేంజీ అనే పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. అయితే అదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు అతన్ని టార్గెట్‌ చేశారు. ఫలితంగా భారీగా మోసపోయాడు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు  గుర్తుతెలియని ఓ వ్యక్తి సలహాతో బాధితుడు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్టాక్‌ ఎక్స్చేంజ్‌ అనే పేరున్న వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. తక్కువ పెట్టుబడులతో స్వల్ప కాలంలోనే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని అతన్ని కొంతమంది నమ్మించారు. ఇవన్నీ నమ్మిన బాధితుడు  సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా వివిధ సందర్భాల్లో అనేక బ్యాంకులు సహా పేమెంట్‌ యాప్‌ల ద్వారా ఏకంగా రూ.64 లక్షలను డిపాజిట్‌ చేశాడు. అయితే ఎంత ఎదురుచూసిన అతని పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. దీంతో మోసపోయానని గుర్తించి స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుపై ముమ్మర దర్యా్ప్తు చేపట్టిన పోలీసులు ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. సైబర్‌ నేరాలపై పోలీసులు ఇతర శాఖల అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చనే ఆశతో ఉన్నదంతా కోల్పోతున్నారు. చివరికి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తెలియని ఆన్‌లైన్‌ గ్రూపుల్లో చేరవద్దని, ప్రత్యేకించి ఇలాంటి పెట్టుబడులు పెట్టాలని సూచించే వ్యక్తుల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతోపాటు వ్యక్తిగత పరిచయం లేకుండా ఎవరికి నేరుగా లేదా మెసేజ్‌, కాల్స్‌ ద్వారా బ్యాంకింగ్‌ సంబంధిత వివరాలను షేర్‌ చేయవచ్చని సూచిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)