76 వేల 'ధరణి' దరఖాస్తుల పరిష్కారం !

Telugu Lo Computer
0


'ధరణి' సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా ధరణి పోర్టల్ను తీసుకొచ్చిందని ఆక్షేపించారు. 2,46,536 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. వాటి పరిష్కారం కోసం ఈ నెల 1 నుంచి తహసీల్దార్ స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో 76,382 దరఖాస్తులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. రోజుకు 15 వేలకు పైగా దరఖాస్తులు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పెండింగ్ మ్యూటేషన్ సంబంధించి 15,070 దరఖాస్తుల్లో 5,471 వరకు పరిష్కరించామని వివరించారు. కోర్టు కేసులకు సంబంధించి 27,672 దరఖాస్తుల్లో 9,883 వరకు పరిష్కరించామన్నారు. ఇప్పటివరకు జరిగిన స్పెషల్ డ్రైవ్ ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేసి సమస్యలను పరిష్కరించడం పట్ల మంత్రి అభినందనలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)