ఆరు ఏళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మిషన్స్ !

Telugu Lo Computer
0


ఆరు ఏళ్లు నిండిన పిల్లలకే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది. 2024 – 25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడ్ 1/ఒకటో తరగతిలో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది విద్యాశాఖ. ఇక తమ ఆదేశాలు పాటించాలని.. లేకపోతే చర్యలు తప్పవని కేంద్రంహెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)