బీట్‌రూట్‌ - ఉపయోగాలు !

Telugu Lo Computer
0


బీట్‌రూట్ బచ్చలికూర కుటుంబానికి చెందినది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అన్ని సీజన్లలోనూ దొరకుతాయి. బీట్‌రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే క్యాన్సర్‌పై పోరాడే బీటాసైనిన్‌ను కలిగి ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉన్నాయి. అత్యధిక నైట్రేట్ కాన్సట్రేషన్‌తో రక్తపోటును బీట్‌రూట్ తగ్గిస్తుంది. శరీరానిక కావాల్సిన పొటాషియం కూడా లభిస్తుంది. శరీరంలో ఎనర్జీ స్థాయులను పెంచుకునేందుకు ఈ జ్యూస్ తాగవచ్చు. గ్లుటామైన్ ఎక్కువగా లభించే వాటిల్లో బీట్‌రూట్ ఒకటి. వయసుతో వచ్చే జబ్బులు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌లపై పోరాడేందుకు బీట్‌రూట్ సాయపడుతుంది. బీట్‌రూట్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, నైట్రేట్స్ వంటి సహజసిద్ధమైన పోషకాలు బీట్‌రూట్‌లో ఉంటాయి. ఇవి రక్త నాళాలను కాస్త రిలాక్స్ చేస్తాయి. రక్త పోటును తగ్గించి గుండెపోటు ప్రమాదాల నుంచి నివారిస్తాయి. ఫోలెట్ అధికంగా లభించే ఈ కూరగాయను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కండరాల రికవరీకి కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బీట్‌రూట్‌లో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ రసతం తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ లభిస్తుందట. బీట్ రూట్ జ్యూస్ తాగి ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని సొంతం చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడే వారు, బీట్‌రూట్ వంటి ఆక్సలేట్ ఆహారాన్ని తినడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)