రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయ్యాకే డబ్బులు కట్ ?

Telugu Lo Computer
0


ఆర్ సీటీసీ యాప్ ద్వారా ఎక్కువశాతం మంది రైల్వే టికెట్లను ఆన్ లైన్లోనే బుక్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మీరు ట్రైన్ టికెట్ కన్పర్మ్ అవ్వకపోయినా మీ డబ్బులు కట్ అయిపోతాయి. తత్కాల్ వంటి లావాదేవీల్లో ఇది సాధారణంగా జరుగుతుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాక మీ ప్రయాణం రద్దు చేసుకుంటే ఆ డబ్బులు మీకు మళ్లీ వెనక్కి రావడానికి మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. ఇది వినియోగదారులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కేవలం టికెట్ బుక్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు కట్ అయ్యే విధంగా ఆ కొత్త ప్రక్రియ ఉంది. ఏ విధానంలో మీరు టికెట్ బుక్ చేసినా టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మీ వాలెట్ లో నుంచి డబ్బులు డిడక్టయ్యే విధంగా నూతన మెకానిజమ్ ను ఐఆర్ సీటీసీ ప్రవేశపెట్టింది. తత్కాల్ లో బుక్ చేసుకున్నప్పుడు లేదా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సమయంలో కూడా టికెట్ ధర కట్ అయిపోతుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఆ డబ్బులు వెనక్కి రావడానికి సమయం పడుతుంది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. మీరు ముందస్తుగా డబ్బు చెల్లించడకుండానే రైల్వే ఈ-టికెట్లను బుక్ చేసుకునే వ్యవస్థను భారతీయ రైల్వే పరిచయం చేసింది. ఐఆర్సీటీసీ యాప్ ద్వారా ఐ-పే పేమెంట్ గేట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఆటో పే అని అంటారు. ఫీచర్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లతో కూడా పనిచేస్తుంది. ఐఆర్ సీటీసీ వెబ్‌సైట్ ప్రకారం, “సిస్టమ్ రైల్వే టిక్కెట్ కోసం పీఎన్ఆర్ ని రూపొందించినప్పుడు మాత్రమే వినియోగదారు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకుంటుంది.” ఈ సిస్టమ్ యూపీఐని ఉపయోగించి ఐపీఓ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల రైల్వే ఇ-టికెట్లను బుక్ చేసుకునే లేదా వెయిటింగ్ లిస్ట్ జనరల్ లేదా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి బాగా ప్రయోజనం ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)