ప్రాణంతీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ !

Telugu Lo Computer
0


కోల్‌కతాకు చెందిన అంజలి షా (25) స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌లో పని చేస్తోంది. ఆమెకు బికాష్ కుమార్ షా (23) అనే ప్రియుడు ఉన్నాడు. అయితే అంజలికి ఏడాది క్రితం పుణెకు చెందిన కారు డీలర్ కాంబ్లే పరిచయం అయ్యాడు. అయితే అంజలి, కాంబ్లే మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు. కాంబ్లేకు అంజలికి ఇదివరకే ప్రియుడు ఉన్నాడని తెలిసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు. కాంబ్లే వేధింపులు భరించలేని అంజలి, అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. తన ప్రియుడు బికాష్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. కోల్‌కతా రావాలని కాంబ్లేను కోరింది. తాను గువహటిలో ఉన్నానని, ఇక్కడే ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తానని చెప్పాడు. కాంబ్లేకు తెలియకుండా బికాష్ కూడా అదే హోటల్‌లో దిగాడు. కాంబ్లే గదికి వెళ్లిన బికాష్‌  అతన్ని చంపి, అనంతరం అంజలి, షా కలిసి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న కాంబ్లేను చూసి హోటల్ సిబ్బంది  పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోల్‌కతా ఫ్లైట్ బయల్దేరే ముందు అంజలి, బికాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)