కుర్చీలా మడత పెట్టే ఇల్లు ?

Telugu Lo Computer
0


డ్రీమ్ హౌస్ కోసం ఎంతో మంది ఎంతగానో కష్టపడుతూ వుంటారు.. ఇప్పుడు మామూలు ఇళ్లను కొనాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే అవి లక్షల్లో ఉంటాయి. ఇంకా బాగా కావాలంటే కోట్లు  పెట్టాలి. ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకు చాలా మంది రకాలుగా ఇంటిని నిర్మిస్తు ఉంటారు. మనం నిత్యం ఇలాంటివి వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మడత పెట్టే ఇల్లు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అమెరికాకు చెందిన 23 ఏళ్ల టిక్‌టాకర్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. లాస్ ఏంజెల్స్ నగరానికి చెందిన జెఫ్రీ బ్రయంట్ టిక్‌టాక్‌లో పంచుకున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.  ఆ ఇంటి ధర అక్షరాల రూ. 21 లక్షలకు పైనే ఉంటుంది. 16.5 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఫోల్డ్ చేయడం. ఈ చిన్న ఫ్లాట్‌లో షవర్, టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూమ్ వున్నాయి. బ్రయంట్ మాత్రమే కాదు. పెరుగుతున్న అద్దెలు, అడ్వాన్స్‌లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఇలాంటి చిన్న ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఇంటి వీడియో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)