బాణాసంచా తయారీ ఫ్యాక్టరీ పేలుడులో ఐదుగురు మృతి

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌ ఉన్న హార్దా ప్రాంతంలోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో పక్కనే ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ టెండర్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)