విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కి ఫిర్యాదు !

Telugu Lo Computer
0

వైసీసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కి  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్  ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన రాజ్యసభలో తన గురించి అనవసరంగా విజయసాయిరెడ్డి మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్ సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సభా హక్కుల కిందకు వస్తుందni మాణిక్కం ఠాకూర్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది మోడీనే అని, మరి ఆ హామీ గురించి విజయసాయిరెడ్డి ఆయన్ను ఎందుకు ప్రశ్నించడం లేదని మాణిక్కం ఠాకూర్ నిలదీశారు. ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. 2019 నుంచి పార్లమెంట్ లో దాదాపు అన్ని బిల్లులు జగన్ మద్దతుతోనే ఆమోదం పొందాయన్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి అన్ని విపక్షాలు బాయ్ కట్ చేస్తే జగన్ మాత్రం హాజరయ్యారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా సాధించడానికి 15 సార్లు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నది జగన్ పార్టీనే అని మాణిక్కం ఠాకూర్ అన్నారు. సభలో బిల్లులకు మద్దతు ఇచ్చి బయటికి వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతారంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వం బీజేపీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కేవలం విజయసాయిరెడ్డి, జగన్ వ్యక్తిగత అవసరాలు, సీబీఐ కేసుల కోసమే బీజేపీకి లొంగిపోయారన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)