ఆలయంలోకి నన్ను ఎందుకు వెళ్లనివ్వరు ?

Telugu Lo Computer
0


భారత్ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా అస్సాంలోని 17 జిల్లాల మీదుగా రాహుల్ పర్యటన కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నగావ్‌ జిల్లాలో సోమవారం రాహుల్‌ పర్యటించారు. ఆ జిల్లాలోని ప్రముఖ బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్‌ వెళ్లారు. ఆలయంలోకి వెళ్లకుండా రాహుల్‌ను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లోకి వెళ్లకుండా ఆయనను, ఆయన అనుచరులను అడ్డగించారు. పోలీసులు వారిని నిలువరించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. 'దేవాలయంలోకి రాకుండా నన్ను అడ్డుకున్నారు. నన్ను అడ్డుకోవటానికి గల కారణం ఏమిటని అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా' అని తెలిపారు. దేవాలయంలోకి ఎవరూ ప్రవేశించాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాను ఆలయాన్ని దర్శించుకోలేనంత తప్పు ఏం చేశానని ప్రశ్నించారు. ప్రార్థనలు చేయడానికి బతద్రవ సత్ర ఆలయానికి వచ్చానని, గొడవలు సృష్టించడానికి కాదని రాహుల్ హితవు పలికారు. కాగా రాహుల్‌ గాంధీ నిర్వహించాల్సిన కార్నర్‌ స్ట్రీట్‌ సమావేశానికి కూడా పోలీసులు నిరాకరించారు. శాంతిభద్రతల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. 'ఒకేరోజు జరుగుతున్న రెండు ప్రధాన కార్యక్రమాలను అదునుగా చేసుకుని కొందరు దుండగులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు వెల్లడించాయి. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యతతో పాటు రాహుల్‌ గాంధీ భద్రతా దృష్ట్యా నిరాకరించాం' అని అస్సాం పోలీస్‌ శాఖ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)