అక్యూట్ కిడ్నీ వ్యాధి - లక్షణాలు !

Telugu Lo Computer
0


మూత్రపిండాలు అకస్మాత్తుగా సరిగ్గా పనిచేయడం మానివేసే దానిని అక్యూట్ కిడ్నీ వ్యాధి అంటారు. సాధారణంగా ఇది తక్కువ వ్యవధిలో సంభవిస్తుంది. దీని కారణంగా మూత్రపిండాల పనితీరు బలహీనపడటం నుండి పూర్తిగా వైఫల్యం చెందడం జరుగుతుంటుంది. కిడ్నీ దెబ్బతినడం అనేది ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన రోగులలో ముఖ్యంగా ఆరోగ్యసమస్యలు అధికంగా ఉన్నవారికి సంభవిస్తుంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు ముందుగా గుర్తించడం, సరైన వైద్య సహాయం తీసుకోవడం వ్యాధి నుంచి బయట పడటం చాలా సులభం. అయితే అక్యూట్ కిడ్నీ గాయాన్ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. అక్యూట్ ఫెయిల్యూర్ ఎలాంటి లక్షణాలు లేకుండా జరుగుతుంటుంది. అయితే కిడ్నీ దెబ్బతినడానికి కారణమైన లక్షణాలు, వైద్య పరిస్థితులు మరియు పలు సంఘటనలు వంటి వైద్య చరిత్రను సమీక్షించడం ద్వారా రోగనిర్ధారణ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి క్రియేటినిన్ మరియు బ్లడ్ యూరియా నైట్రోజన్ స్థాయిలను కొలవడానికి రక్త పరీక్షలు చేస్తారు. అంతే కాకుండా కిడ్నీ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మూత్ర పరీక్షలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, మూత్ర నాళంలో నిర్మాణపరమైన అసాధారణతలు లేదా అడ్డంకులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ లేదా సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు చేయవచ్చు.

లక్షణాలు : మూత్రపిండాలకు రక్త ప్రసరణ తగ్గడం - ఇది నిర్జలీకరణం, తక్కువ రక్తపోటు, గుండె వైఫల్యం కారణంగా సంభవించవచ్చు.

కిడ్నీలకు వ్యాధి - ఇన్‌ఫెక్షన్‌లు, కొన్ని మందులు, టాక్సిన్స్ లేదా మెడికల్ ఇమేజింగ్ ప్రక్రియలలో ఉపయోగించే కాంట్రాస్ట్ డైలు నేరుగా కిడ్నీలకు హాని కలిగిస్తాయి.

కిడ్నీ సంబంధిత వ్యాధులు - గ్లోమెరులోనెఫ్రిటిస్ లేదా ఇంటర్‌స్టీషియల్ నెఫ్రిటిస్ వంటి పరిస్థితులు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి.

మూత్ర నాళాల అవరోధం - మూత్రపిండ రాళ్లు లేదా విస్తరించిన ప్రోస్టేట్ వంటి అడ్డంకులు మూత్ర నాళాల అవరోధానికి కారణమవుతాయి. ఇది AKIకి దారితీయవచ్చు. మూత్రం తగ్గడం, కాళ్లు, చీలమండలు లేదా ముఖం వాపు ఉండటం ఈ వ్యాధి సాధారణ లక్షణాలు. అంతే కాకుండా అలసట మరియు బలహీనత, వికారం, వాంతులు లేదా ఆకలి లేకపోవడం, శ్వాస ఆడకపోవడం మరియు గందరగోళం లేదా దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)