పోలీసుల మెరుపు సమ్మెతో రెచ్చిపోయిన నేరగాళ్లు !

Telugu Lo Computer
0


పువా న్యూ గినియాలో జీతాల్లో కోత విధించడంపై ఆగ్రహంగా ఉన్న పోలీసులు సమ్మెకు దిగడంతో అక్కడి నేరగాళ్లు రెచ్చిపోయారు. దేశ రాజధాని పోర్ట్‌ మోరెస్బీలోని దుకాణాల్లోకి చొరబడి లూటీలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నిప్పు పెట్టినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. బుధవారం రాత్రి చోటు చేసుకున్న అల్లర్లలో 15 మంది పౌరులు మృతి చెందినట్లు తెలిపాయి. గత ఏడాది కాలంగా పపువా న్యూ గినియాలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నూతన సంవత్సరం తమ జీతాలు తగ్గించినట్లు గుర్తించిన పోలీసులు బుధవారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో లూటీలు మొదలయ్యాయి. ప్రభుత్వ నూతన పన్ను విధానంతో తాము నష్టపోతున్నట్లు పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధ్యక్షుడు జేమ్స్‌ మరాపే మాట్లాడుతూ పాలనాపరమైన లోపం కారణంగా పోలీసు సిబ్బంది వేతనాల్లో కోత విధించామన్నారు. కొత్త పన్ను విధానం వారికి వర్తించదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన ప్రకటనతో పాక్షికంగా విధుల్లో చేరిన పోలీసులు అల్లర్లను అదుపు చేయడానికి శ్రమిస్తున్నట్లు పోర్ట్‌ మోరెస్బీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)