అడుగడుగునా అడ్డంకులతో జోడో న్యాయ్ యాత్ర !

Telugu Lo Computer
0


భారత్ జోడో న్యాయ్ యాత్రను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. తన యాత్రను అణిచివేసేందుకు బీజేపీ చేపడుతున్న చర్యలు తమ పార్టీ యాత్రకు ప్రచారం కల్పిస్తున్నాయని అన్నారు. గువహటిలో రాహుల్ యాత్రతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో కాంగ్రెస్ నేతపై కేసు నమోదు చేయాలని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర డీజీపీకి సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మితిమీరి నక్సల్స్ ఎత్తుగడలకు పాల్పడుతున్నారని సీఎం ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి సీఎం హిమంత శర్మేనని కామ్‌రూప్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర నిరుద్యోగం, అవినీతి, ధరల మంట సహా పలు సమస్యలు వెంటాడుతున్నాయని ప్రజలు తనతో గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు. తమ యాత్రను దెబ్బతీసేందుకు సీఎం చేపడుతున్న చర్యలు అంతిమంగా తమకు ఉపకరిస్తాయని చెప్పారు. అసోం సీఎం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన యాత్రను అణిచివేసేందుకు చేపడుతున్న చర్యలు భారత్ జోడో న్యాయ్ యాత్రకు ప్రచారం కల్పిస్తున్నాయని అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలన్నదే తమ అంతిమ లక్ష్యమని రాహుల్ పేర్కొన్నారు. చివరికి బీజేపీ శ్రేణులు యాత్ర పొడవునా చేతులు ఊపుతూ స్వాగతిస్తున్నాయని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)