పార్లమెంటు భద్రతకు 140 మంది 'సీఐఎస్‌ఎఫ్‌' సిబ్బంది

Telugu Lo Computer
0


శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపడంతో స్థానికంగా భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. దీంతో ఆ భవన సముదాయంలో సమగ్ర భద్రత బాధ్యతలను సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించాలని నిర్ణయించిన కేంద్రం.. తాజాగా 140 మంది సిబ్బందిని మోహరించింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల వేళ పార్లమెంటు కాంప్లెక్స్ వద్ద సందర్శకులు, సామగ్రి తనిఖీల బాధ్యతలను వీరు నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 140 మందిలో 36 మంది సీఐఎస్‌ఎఫ్‌ అగ్నిమాపక విభాగానికి చెందినవారు. విమానాశ్రయాల్లో సెక్యూరిటీ తరహా సేవలను 'సీఐఎస్‌ఎఫ్‌' అందించనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌రే యంత్రాలు, డిటెక్టర్లతో సందర్శకులను, వస్తువులను తనిఖీ చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాదాపు 1.70 లక్షల మంది సిబ్బందితో కూడిన 'సీఐఎస్‌ఎఫ్‌'.. కేంద్ర హోంశాఖ అధీనంలోని కేంద్ర సాయుధ పోలీసు దళం. ఇది దిల్లీలోని పలు కేంద్రశాఖల భవనాలతో పాటు 68 పౌర విమానాశ్రయాలు, అణుశక్తి, ఏరోస్పేస్‌ కేంద్రాలు, దిల్లీ మెట్రో వద్ద భద్రత కల్పిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)