సమాజంలో విద్వేష వ్యాప్తికి ఆరెస్సెస్‌, బీజేపీ కుట్ర

Telugu Lo Computer
0


భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం రాజ్‌ఘఢ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ జోడో యాత్రలో యువత నిరుద్యోగం గురించి కలత చెందుతూ ఫిర్యాదు చేశారని, ఇక రైతులు తమ పంటలకు సరైన ధర రావడం లేదని ఆవేదన చెందారని అన్నారు. ఇప్పుడు మీ గళం మరోసారి వినేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్రతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని చెప్పారు. యువత స్కూల్‌, కాలేజ్ విద్య కోసం రూ లక్షలు వెచ్చించినా ఉద్యోగం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా చిరు వ్యాపారులు దెబ్బతిన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల బాగు కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మేనని అసోసం సీఎంపై విరుచుకుపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)