మాట్రిమోనీ సైట్‌లో ద్వారా మోసపోయిన మహిళ !

Telugu Lo Computer
0


మిళనాడు తంజావూర్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసి రూ.3 లక్షలు, 120 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. తాజాగా ఈ కేసులో నిందితుడు సిబిచక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ వితంతువు కావడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బు, నగలు ఇచ్చేలా మహిళను మోసం చేశాడు. సిబిచక్రవర్తి కేవలం 12వ తరగతి మాత్రమే చదివినప్పటికి ఇంజనీర్‌నని పేర్కొంటూ మ్యాట్రిమోనియల్ సైట్‌లో తప్పుగా చూపించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వితంతు మహిళను లక్ష్యంగా చేసుకుని, పెళ్లి చేసుకుంటానని తన వలలో వేసుకుంటున్నాడని, ప్రొఫైల్‌లో తప్పుడు ఫోటోలు ఉపయోగించి మహిళల్ని మోసం చేస్తున్నట్లు తెలిసింది. ఇదే కాకుండా ఇతనిపై పలు పెండింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్ పరిశీలించగా మొత్తం 80 మంది స్త్రీల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)