కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశలోని కునో నేషనల్‌ పార్క్‌లో మరో చితా 'శౌర్య' మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు 'శౌర్య' చీతా మరణించినట్లు ప్రాజెక్టు చీతా డైరెక్టర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీతా మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని అ‍న్నారు. చీతాకు పోస్ట్‌ మార్టం చేసి మరణించడాకి గల కారణాన్ని చెబుతామని అన్నారు. ఈరోజు ఉదయం నుంచి శౌర్య చీతా చాలా తీవ్ర అస్వస్థతతో ఉన్నట్లు కునో నేషనల్‌ పార్క్‌ సిబ్బంది గమనించింది. వెంటనే అధికారులు, పార్క్‌ సిబ్బంది స్పందించి చీతాకు చికిత్స అందిస్తూ పర్యవేక్షించారు. చీతాకు సీపీఆర్‌ కూడా అందించారు. కానీ, దురదృష్టవశాత్తు చీతా 'శౌర్య' మరణించిందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)