రోడ్‌వే కిట్‌తో క్షణాల్లో రహదారి నిర్మాణం !

Telugu Lo Computer
0


హదారులు సరిగా లేని మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో క్షణాల్లో తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం రూపొందించిన రోడ్‌వే కిట్‌ ఎంతో అద్భుతంగా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు. దీంతో యుద్ధాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైనిక వాహనాలు, సహాయక సామగ్రిని సులువుగా తరలించవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో షేర్‌ చేశారు. ''ఇది ఎంతో అద్భుతంగా ఉంది. రహదారి లేని మైదాన ప్రాంతాల్లో దీని సాయంతో మన సైన్యం సులువుగా ఆయుధ సామగ్రిని, వాహనాలను తరలించవచ్చు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక బృందాలకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది'' అని ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)