'స్పేస్‌ఎక్స్‌' రాకెట్‌ ద్వారా జీశాట్‌-20 ప్రయోగం ?

Telugu Lo Computer
0


స్పేస్‌ఎక్స్‌'కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్‌ 'జీశాట్‌-20  ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 4,700 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్నిరిమోట్‌ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా రూపొందించారు. 'జీశాట్‌-20' ప్రయోగం నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారి ఫాల్కన్‌-9 సేవలను వినియోగించుకోనుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లే అవకాశం ఉందని ఆ కథనాలు పేర్కొన్నాయి. సమయానికి మరే రాకెట్ అందుబాటులో లేనందున స్పేస్‌ఎక్స్‌ సేవలను వినియోగించుకోవాల్సి వస్తోందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ తెలిపారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నిర్వహించనున్న ఈ ప్రయోగం కోసం స్పేస్‌ఎక్స్‌తో ఇస్రో ఒప్పందం చేసుకుంది. భారీ ఉపగ్రహాల ప్రయోగాలపై ఇప్పటివరకు ఫ్రాన్స్‌ నేతృత్వంలోని ఏరియన్‌స్పేస్‌ కన్సార్టియంపై భారత్‌ ఆధారపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)