ఇరాన్‌ భారీ పేలుళ్లులో 104 మంది దుర్మరణం !

Telugu Lo Computer
0

రాన్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 104 మంది మృతిగా, 170 మంది తీవ్రంగా గాయడినట్లు ఇరాన్‌ స్థానిక మీడియా వెల్లడించింది. దివంగత ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ సమాధి సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. శ్మశాన వాటికలో పేలుడు జరిగిన చోటుకు కొంతదూరంలో రెండు పరికరాలను గుర్తించారు. వాటి ఆధారంగా ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్‌ను ఉపయోగించి బాంబులను పేల్చారనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్‌ ఫోర్స్‌కు ఖాసీం సులేమానీ నేతృత్వం వహించేవాడు. ఆయన 2020లో అమెరికా జరిపిన వైమానికి దాడిలో మరణించారు. నేడు ఖాసీం సులేమానీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో నిమిషాల వ్యవధిలో వరసగా పేలుళ్లు జరిగాయి. ఖాసీం సులేమానీ జయంతి రోజే సమాధి వద్ద ఈ పేలుళ్లు జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని కెర్మాన్ ప్రావిన్స్ చెందిన అధికారులు తెలిపారు. మరోవైప మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)