అస్సాం చరిత్ర తెలియకపోతే అసలు మాట్లాడొద్దు !

Telugu Lo Computer
0


స్సాంకు సంబంధించి సీనియర్‌ నాయ్యవాది  కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  అస్సాం రాష్ట్ర చరిత్ర గురించి తెలియకపోతే అసలు మాట్లాడొద్దన్నారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదిస్తూ అస్సాంకు సంబంధించి కపిల్‌ సిబల్‌ గతంలో అస్సాం రాష్ట్రం మయన్మార్‌ (బర్మా)లో భాగంగా ఉండేదని పేర్కొన్నారు. అయితే సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌పై సీఎం హిమంత్‌ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అస్సాం చరిత్రపై అవగాహన లేనివారు మాట్లాడొద్దని ఘాటుగా విమర్శించారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదని అన్నారు. కేవలం ఒక సమయంలో ఇరువురికి ఘర్షణలు జరిగినట్లు తెలిపారు. అది ఒక్కటి మాత్రమే ఆ దేశానికి అస్సాంకి ఉ‍న్న ఒ‍క సంబంధమని పేర్కొన్నారు. అంతేకానీ, అస్సాం మయన్మార్‌లో భాగంగా ఉన్నట్లు ఎక్కడా చరిత్రలో రాసి ఉ‍న్నట్లు తాను చూడలేదన్నారు. ఇక మణిపూర్‌లో అల్లర్లు జరగటానికి మయన్మార్‌ నుంచి వచ్చిన వలసదారులు కూడా ఓ కారణమని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)