నకిలీ వీసాతో భారత్‌లోకి ప్రవేశించిన అమెరికన్ కు రెండేళ్లు జైలు శిక్ష !

Telugu Lo Computer
0


కిలీ వీసాతో భారత్‌లోకి ప్రవేశించిన అమెరికా జాతీయుడికి ఉత్తరప్రదేశ్‌ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష, రూ.20,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించింది. అమెరికా జాతీయుడైన 36 ఏళ్ల ఎరిక్ డేనియల్ బెక్‌విత్, ఈ ఏడాది మార్చి 29న నేపాల్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించాడు. నేపాల్‌, భారత్‌ సరిహద్దు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా సోనౌలీలో ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు అతడి పత్రాలను తనిఖీ చేశారు. నకిలీ వీసా ఉన్నట్లు గుర్తించడంతో మహారాజ్‌గంజ్ పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్లు, ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ 14 కింద కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం భారత్‌లోని అమెరికా ఎంబసీకి, నిఘా వర్గాలకు సమాచారం అందించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)