గూగుల్ మ్యాప్స్‌లో 'ట్రైన్ లైవ్ లొకేషన్' ఫీచర్‌ !

Telugu Lo Computer
0


గూగుల్ మ్యాప్స్‌లో 'ట్రైన్ లైవ్ లొకేషన్' ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ యాడ్ చేయనుంది. ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ అనేది 'where is my train' యాప్‌కు కనెక్ట్ అయి పనిచేస్తుంది. ఈ కొత్త ఫీచర్ 2024 సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుంది. వాహనదారుల ఇంధన ఖర్చులను ఆదా చేసే ఫీచర్లను కూడా గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. వాహనం ఇంజిన్‌ సామర్థ్యాన్ని బట్టి నిర్దిష్ట మార్గంలో ఎంత ఇంధనం ఖర్చవుతుందనే విషయాన్ని ఈ ఫీచర్ తెలియజేస్తుంది. ఏఐ టెక్నాలజీతో గూగుల్ లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్లు, రూట్ సమాచారాన్ని కూడా వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌లో చూడొచ్చు. చాలామంది వ్యక్తులు ఎవరికైనా చిరునామా ఇవ్వడానికి చిన్న ల్యాండ్ మార్కులను వాడతారు. ఇకపై ఇదంతా గూగుల్ నుంచే పని చేస్తుంది. మ్యాప్‌లో మీరు ఇచ్చిన అడ్రస్‌కు సమీపంలో Google 5 ల్యాండ్ మార్కులు, ఏరియా పేర్లను చూపిస్తాయి. దీని నుంచి అడ్రస్ ఎక్కడ ఉందో యూజర్లు ఈజీగా అర్థం చేసుకుంటారు. సాధారణంగా భారతీయులు తాము వెళ్లే దారిలో చిన్న చిన్న గుర్తులను ఉంచుకుంటారు. ఉదాహరణకు పార్క్, షాప్ లాంటివి. ఇలాంటి వాటిని ఇప్పుడు సెర్చ్ ఇంజిన్లు గ్రహించాయి. అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. వీటిని వాడుకొని గూగుల్ మ్యాప్స్‌లో అడ్రస్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ మీరు సులభంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.  గూగుల్‌ మ్యాప్స్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫీచర్.. వర్చువల్ లైవ్ వాక్. దీని ద్వారా వినియోగదారులు స్ట్రీట్‌లో నడుస్తున్నప్పుడు నావిగేషన్ స్టెప్స్‌ను అందుకోవచ్చు. ఫోన్ స్క్రీన్‌పై యారోలు డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఎక్కడ టర్న్‌ తీసుకోవాలో అవి సూచిస్తుంటాయి. వైబ్రేషన్ అలర్ట్‌లు కూడా ఇస్తాయి. ఈ లైవ్‌ వాకింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరచడానికి గూగుల్ AI, AR టెక్నాలజీని ఉపయోగిస్తుంది. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్‌ యూజర్లకు దాదాపు 3000 నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. క్రోమ్ వెబ్‌ బ్రౌజర్‌, గూగుల్ సెర్చ్‌లో లభ్యమయ్యే విజువల్ టూల్ 'లెన్స్ పవర్'. ఇది ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌కి ఎక్స్‌టెండ్‌ అవుతోంది. యూజర్లు కెమెరాను స్ట్రీట్‌లోకి నావిగేట్ చేస్తూ సమీపంలోని రెస్టారెంట్‌లు, కేఫ్‌లు, వాటిని ఓపెన్‌ చేసే సమయాలు, రేటింగ్‌లు, రివ్యూలు, ఫోటోలు వంటి సమాచారాన్ని చూడొచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)