బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ !

Telugu Lo Computer
0


బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు . తన స్వగ్రామం అయిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ లో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం.. కొల్గూర్ వచ్చిన పోలీసులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్ల కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రకటన తర్వాత ఆదివారం (డిసెంబర్ 17) అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్‌, రన్నరప్ అమర్‌ దీప్‌ అభిమానుల మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాలు రెచ్చిపోయి కొట్టుకున్నారు. ఆరు సిటీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. బస్సు అద్దాలు పగులగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వెహికల్ తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. జూబ్లీహిల్స్ చెక్​పోస్టు దగ్గర హంగామా సృష్టించారు. రెండు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి. రన్నరప్​గా నిలిచిన అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. ఈ అల్లర్లపై బిగ్​బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్​పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. పల్లవి ప్రశాంత్ని A-1 గా, అతని సోదరుడు మనోహర్ ను A2గా, A-3గా ఫ్రెండ్ వినయ్ని చేర్చారు. ఈ క్రమంలోనే పోలీసులు పల్లవి ప్రశాంత్.. అలియాస్ రైతు బిడ్డను అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)