సమస్యలన్నింటికీ 'గీత'లోనే పరిష్కారం !

Telugu Lo Computer
0


ర్యానా లోని కురుక్షేత్రలో నిర్వహించిన అంతర్జాతీయ గీతా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన సంత్‌ సమ్మేళన్‌లో అమిత్‌ షా పాల్గొని మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఎందరో మహాత్ములు, సాధువులు భగవద్గీత నుంచి జ్ఞానాన్ని సముపార్జించారని అమిత్‌ షా చెప్పారు. సమాజం, దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకూ భగవద్గీతలో సమాధానం దొరుకుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు విద్యావంతులను తాను కలిసినప్పుడు వారూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుతం మనమందరం కూర్చున్న ఇదే చోట (కురుక్షేత్రను ఉద్దేశిస్తూ) 5 వేల ఏళ్ల క్రితం అర్జునుడికి కృష్ణుడు గీతను బోధించాడని గుర్తు చేశారు. చిన్నతనంలో తన తల్లి గీత బోధించారని చెప్పారు. అందుకే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినప్పటికీ.. ఆ బాధ, నిరాశలను అనుభవించలేదని చెప్పారు. గీతా ఫెస్టివల్‌ నిర్వహించాలని 2014లో ప్రధాని మోదీ ఆకాంక్షించారని, 2016 నుంచి ఈ పండగను అంతర్జాతీయ స్థాయిలో ఏడేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నామని అమిత్‌ చెప్పారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే భాజపా లక్ష్యమని, అందుకు అనుగుణంగానే విధాన నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌ పూర్తిగా భారత్‌లో విలీనం అయ్యిందని చెప్పారు. రామ మందిర నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు వంటి కీలక హామీలను నెరవేర్చామని గర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)