దేశంలో 423 కరోనా కొత్త కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 423 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. కేరళలో నిన్న 266 కేసులు, తెలంగాణలో 8 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 8 కేసులు నమోదయ్యాయి.  నిన్న దేశవ్యాప్తంగా కరోనాతో నలుగురు చనిపోయారు. వారిలో ఇద్దరు కేరళలో చనిపోగా, కర్ణాటకలో ఒకరు, రాజస్థాన్‌లో ఒకరు చనిపోయారు. ఈ కరోనా కేసుల్లో కొత్త వేరియంట్‌ (JN.1)వి ఎన్ని కేసులు అనేది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తంగా జరుగుతున్న టెస్టులతో కొత్త కేసులు బయటపడుతున్నాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)