తుపాన్ బాధిత ప్రాంతాల్లో రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే !

Telugu Lo Computer
0


మిళనాడులో మిగ్‌జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు నష్టం వచ్చిన ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే జరిపారు. మిగ్ జాం తుపాన్ వల్ల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాలపై ప్రధాని మోడీ తీవ్ర ఆందోళన చెందారని, తమిళనాడులో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలని తనను ఆదేశించారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యకలాపాల కోసం కేంద్రం రూ.500 కోట్లను ఆమోదించిందని, రెండో విడత కింద రూ.450 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను ప్రధాని ఆదేశించారని చెప్పారు. ఏరియల్ సర్వే తరువాత సచివాలయంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో రాజ్‌నాధ్ సింగ్ సమావేశమయ్యారు. వానలు, వరదలతో దెబ్బతిన్న చెన్నైతోపాటు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి, ఈ విపత్తు వల్ల సంభవించిన నష్టం, కేంద్రం నుంచి సాయం తదితర అంశాలపై చర్చించారు. రాజ్‌నాథ్ సింగ్ వెంట కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ కూడా ఉన్నారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల్లో తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని, తక్షణ సాయంగా రూ. 5060 కోట్లు ఇవ్వాలని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)