తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


రోజు కూడా మార్కెట్ లో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర గత పదిరోజుల కనిష్ట రేటును చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుండి భారీ పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మాత్రం నెల చూపులు చూసింది. డిసెంబర్ 1వ తేదీ రూ. 62,730 రూపాయల వద్ద ఒక తులం బంగార ధర ప్రారంభం అయ్యింది. అయితే, డిసెంబర్ 1వ తేదీ నుండి బంగారం ధర అంచెలంచలుగా పెరిగిన గోల్డ్ రేట్ డిసెంబర్ 4న తారాస్థాయికి చేరుకుంది. డిసెంబర్ 4న బంగారం ధర భారీ పెరుగుదలను చూసి రూ. 64,200 రూపాయల వద్ద నిలిచింది. డిసెంబర్ 5 న మార్కెట్ లో విపరీత పరిణామాలు చేటు చేసుకోవడంతో గోల్డ్ మార్కెట్ పడిపోయింది. డిసెంబర్ 5 న 10 గ్రాముల బంగారం ధర రూ. 1,090 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 63,110 రూపాయలకు చేరుకుంది. తరువాత రోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగి డిసెంబర్ 6 న మళ్లీ తులానికి రూ. 440 రూపాయలు క్రిందకు దిగడంతో రూ. 62,670 రూపాయల వద్ద క్లోజింగ్ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)