మరదలుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన బావ !

Telugu Lo Computer
0

ధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో నిర్మల భర్త ప్రకాష్‌ ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే తన తమ్ముడి మరణానికి మరదలు కారణమని ప్రకాష్‌ అన్న సురేష్‌ ఆరోపించాడు. నాటి నుంచి నిర్మలపై పగ పెంచుకున్నాడు. భర్త మరణించిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్త వారింట్లోనే నిర్మల ఉంటున్నది. ఈ నేపథ్యంలో సురేష్‌ శనివారం ఆమెను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చాడు. పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో నిర్మల సజీవంగా కాలి చనిపోయింది. అనంతరం ఆమె సోదరుడికి సురేష్‌ ఫోన్‌ చేశాడు. నిర్మలను తగులబెట్టి చంపినట్లు చెప్పాడు. మరోవైపు భర్త ఆత్మహత్యకు కారణమంటూ అత్తింటి వారు నిర్మలను వేధిస్తున్నారని, చంపుతామని బెదిరించారని ఆమె సోదరుడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో సోదరిని పుట్టింటికి తెచ్చేందుకు శనివారం ఆమె అత్తవారింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యానని తెలిపాడు. అంతలోనే ఆమెను తగులబెట్టి చంపినట్లు ఫోన్‌ చేశారని చెప్పాడు. దీంతో నిర్మల సోదరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేష్‌ను అరెస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)