వీధి కుక్కల ధాటికి దొంగలు పరుగో పరుగు !

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బార్రా 6 పరిసర ప్రాంతంలోని రాధాకృష్ణ ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు దొంగల ప్లాన్ వీధి కుక్కల వల్ల బెడిసికొట్టింది. గుర్రంపై వచ్చిన దుండగులు నేరానికి పాల్పడిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వడంతో ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలోని టైమ్‌స్టాంప్ ప్రకారం, ఈ సంఘటన డిసెంబర్ 20న జరిగింది. ఈ ఫుటేజీలో ఓ వ్యక్తి గుర్రంపై కూర్చొని ఉండగా.. మరొక వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించడం కనిపిస్తోంది. ఈ సమయంలోనే అక్కడున్న వీధి కుక్కలు గట్టిగా అరవడంతో.. చుట్టు పక్కల స్థానికులు వెంటనే బయటికి వచ్చారు. నివాసితులు దొంగలను వెంబడించడం ఈ వీడియోలో చూడవచ్చు కానీ అది ఫలించలేదు. ఆ దొంగలు అక్కడ్నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)