నియోమాక్స్ సంస్థ రూ.207 కోట్ల ఆస్తులు సీజ్ !

Telugu Lo Computer
0


మిళనాడులోని మధురైకి చెందిన నియోమాక్స్ సంస్థకు చెందిన రూ. 207 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆదివారం మనీలాండరింగ్ కేసులో అటాచ్ చేసింది. నియోమాక్స్ గ్రూప్ కంపెనీలు ప్రజల నుంచి వందల కోట్ల రూపాయల నిధులను సేకరించి షెల్ ఎంటీటీలు, గ్రూప్ కంపెనీలు, ఇతర సంస్థలకు మళ్లించాయని ఇన్వెస్టర్ల చేసిన ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులునమోదు చేసిన కేసును ఈడీ  దర్యాప్తు చేస్తోంది. నియోమాక్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఇన్వెస్టర్లు చేసిన ఫిర్యాదు మేరకు .. నియోమాక్స్ దాని గ్రూప్ కంపెనీలు 12నుంచి30 శాతం వడ్డీతో చెల్లిస్తామని అధిక రాబడి ఆశ చూపి ఇన్వెస్టర్లనుంచి లక్షల్లో డబ్బు డిపాజిట్ చేయించారని.. తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. నియోమాక్స్ కంపెనీ ప్రజల నుంచి వందల కోట్ల నిధులు సేకరించిందని..ఈ నిధులను షెల్ ఎంటీటీలు, ఇతరసంస్థలకు మళ్లించడం ద్వారా ప్రజలను మోసం చేశారని దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. ఆర్థిక నేరాల ద్వారా వచ్చిన డబ్బును దాచిపెట్టేందుకు కంపెనీ ఖాతా పుస్తకాలను తారుమా చేసిందని నియోమాక్స్ కంపెనీ ఆడిటర్ అంగీకరించినట్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)