ప్రజా ప్రతినిధుల క్రిమినల్‌ కేసులపై ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి !

Telugu Lo Computer
0


ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్​లను ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని హైకోర్టులను ఆదేశించారు. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ధర్మాసనం సూచించింది. కేసుల వివరాలు, విచారణలో ఉన్న అంశాలకు సంబంధించిన వివరాలను జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేక ట్యాబ్‌ ఏర్పాటు చేసి వాటి వివరాలు పొందుపరచాలని హైకోర్టులకు సూచించింది. ఇందుకు అవసరమై మౌలిక సదుపాయాలు, సాంకేతికతను జిల్లా న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)