జ్యుయలరీ షోరూమ్‌ లూఠీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 9 November 2023

జ్యుయలరీ షోరూమ్‌ లూఠీ !


త్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో పోలీసులు బిజీ అయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. ప్రముఖ జ్యుయలరీ షోరూమ్‌లో ఖరీదైన బంగారు ఆభరణాలు లూఠీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 7 నుంచి 9 వరకు ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతోపాటు గోవింద్ బల్లభ్ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ 35వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. అలాగే బద్రీనాథ్ ఆలయాన్ని కూడా ఆమె సందర్శించారు. కాగా, రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లలో ఉత్తరాఖండ్ పోలీసులు బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో దొంగలు రెచ్చిపోయారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సాయుధులైన ఐదుగురు డెహ్రాడూన్‌లోని రిలయన్స్ జ్యుయలరీ షోరూమ్‌లోకి ప్రవేశించారు. గన్స్ చూపించి అక్కడి సిబ్బందిని బెదిరించారు. కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జ్యుయలరీ షోరూమ్‌కు వెళ్లారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నగల దోపిడీకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

No comments:

Post a Comment