90 రోజుల తరవాతే డీయాక్టివేట్‌ సిమ్‌లు ఇతరులకు కేటాయింపు !

Telugu Lo Computer
0


డీయాక్టివేట్‌ అయిన మొబైల్‌ నంబర్లు, చందాదారుల అభ్యర్థన మేరకు రద్దు చేసిన మొబైల్‌ నంబర్లను కనీసం 90 రోజుల తరవాతే ఇతరులకు కేటాయిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) తెలిపింది. వినియోగం లేనందున రద్దయిన, డీయాక్టివేట్‌ అయిన మొబైల్‌ నంబర్లకు సంబంధించిన డేటా దుర్వినియోగం అవుతోందంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ట్రాయ్‌ ఈ విధంగా స్పష్టం చేసింది. 'ఒక మొబైల్‌ నంబరుతో వాట్సప్‌ ఖాతా వినియోగించిన వారు, ఆ నంబరును రద్దు చేసుకున్నప్పుడు వాట్సప్‌ ఖాతాను కూడా రద్దు చేసుకోవాలని.. ఆ ఫోన్‌ మెమొరీతో పాటు క్లౌడ్‌/డ్రైవ్‌లో ఉన్న వాట్సప్‌ సమాచారాన్ని కూడా తొలగించుకుంటే, దానిని ఎవరూ దుర్వినియోగం చేసే వీలుండద'ని పేర్కొంటూ ట్రాయ్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీనిని న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను ఇంకా కొనసాగించాలనుకోవడం లేదని సుప్రీం బెంచ్‌ పేర్కొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)