మూడు రోజులపాటు భారీ వర్షాలు

Telugu Lo Computer
0


శాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల రాకతో శనివారం ఉదయం నుంచి దక్షిణాది జిల్లాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు. రానున్న మూడు రోజులపాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం పతనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకులం అనే మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే ఏడు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ చెబుతోంది. ఈ వర్షపాతం తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ కర్ణాటకలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాలో పాఠశాలలను మూసివేశారు. రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెన్నై, కన్యాకుమారి, తెన్కాసి, తేని, మధురై, తిరునల్వేలి, దిండిగల్, శివగంగై, నెల్లై వంటి తొమ్మిది జిల్లాల్లోని పాఠశాలలను ఒక రోజు తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు రానున్న ఆరు రోజుల పాటు తమిళనాడు పాండిచ్చేరి, కారైక్కల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చెన్నై ప్రాంతీయ వాతావరణ శాఖ ప్రకారం నివేదిక ప్రకారం రాబోయే మూడు రోజులు కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాసి, తేని, దిండిగల్, విరుదునగర్, మధురై, శివగంగ, పుదుక్కోట్టై, తిరుప్పూర్, కోయంబత్తూర్, నీలగిరి, ఈరోడ్, క్రిష్ణగిరి, ధర్మపురి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా వాతావరణ శాఖ నివేదికల ప్రకారం శనివారం కురిసిన వర్షానికి తమిళనాడులోని చిదంబరం ప్రాంతంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్నామలై నగర్, మంజోలై, రాధాపురం, కక్కాచిలో గత 24 గంటల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కేరళ, తమిళనాడులోని పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేరళలోని అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్ జిల్లాల్లో శనివారం ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నవంబర్ 4 నుంచి 8 వరకు కేరళలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా శనివారం, ఆదివారం చాలా చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)