ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు, పప్పులు, గింజలు !

Telugu Lo Computer
0


రోజుల్లో చాలా మంది విటమిన్ల లోపంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.విటమిన్ బి12, విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైనవి. అలాగే ఆరోగ్యానికి ఫైబర్ కూడా చాలా అవసరం. ఫైబర్‌లోని పీచు ఆకలి వేయకుండా చేసి, కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండేలా చేస్తుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని రక్షించడంలో ఫైబర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్‌ అధికంగా ఉండే పండ్లలో బేరి పండ్లు ముందు వరుసలో ఉంటాయి. ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. బేరి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల బేరిలో 3.1 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. బేరీ పండ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ సహాయపడతాయి. ఇది బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటును నివారించడంలో కూడా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఫైబర్ కూడా వీటిల్లో పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీలు తినడం వల్ల వీటిల్లోని పోషకాలు వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఓట్స్‌లో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తింటే బరువు సులువుగా తగ్గుతారు. ఓట్స్ కూడా జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నివారించగలవు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు ఓట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. పప్పుల్లో ప్రోటీన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. పప్పు వారానికి కనీసం 4-5 రోజులు తినాలి. ఇది జీర్ణక్రియ, జీవక్రియను పెంచుతుంది. అలాగే ప్రతిరోజూ పండ్లు, పప్పులు, గింజలు కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగాల నుంచి కాపాడే రోగనిరోధకతను బలంగా ఉంచుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)