వందేభారత్ లో స్లీపర్ కోచ్‌లు !

Telugu Lo Computer
0


రైల్వేశాఖ వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టనుంది. 2024 నుంచి ఆ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. స్లీపర్ కోచ్‌ల ఫొటోలు షేర్ చేశారు. వందేభారత్ స్లీపర్ కోచ్‌లు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కంటే ఎన్నో అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. నిద్రించడానికి సౌకర్యవంతమైన పడకలు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్, విశాలమైన టాయిలెట్స్‌, ప్రపంచ స్థాయి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కోచ్‌లలో ఉన్నాయి. ఈ స్లీపర్ కోచ్‌ వందేభారత్ మరింత శక్తివంతమైన, పర్యావరణ అనుకూలంగా ఉండనుంది. 'మేక్‌ అన్ ఇండియా' ప్రోగ్రామ్‌లో భాగంగా చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. మొదటి రైలును 2019 ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీ-వారణాసి రైలు ప్రారంభం అయింది. దేశంలో ఎంత దూరంలో ఉన్న ప్రాంతాన్నైనా వందేభారత్ రైళ్ల రాకతో గంటల వ్యవధిలోనే సౌకర్యవంతంగా ప్రయాణికులు చేరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)