గ్యాస్ సిలిండర్‌పై డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ పెంపు

Telugu Lo Computer
0

ఎల్‌పీజీ గ్యాస్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనంది. ఒక్కో సిలిండర్ పై డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను రూ.73 కు పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అయితే గత ఏడాది మే నెల నుంచి డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను రూ. 64.84గా నిర్ణయించింది కేంద్ర సర్కారు. ఇదే కమీషన్ గతేడాది కాలంగా కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు దాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నెల 3న కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను ఇప్పుడు రూ. 73 కు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ కమీషన్ పెంపు కారణంగా వంట గ్యాస్ ధర పెరగడం కానీ.. సామాన్యులపై ఎలాంటి భారం పడే విధంగా గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్ కమీషన్ పెరిగిన క్రమంలో వినియోగదారులు ఎవరూ గ్యాస్ ధర కంటే ఎక్కువ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలంతా గుర్తు ఉంచుకోవాల్సిన విషయం. డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను కేంద్రం పెంచిన క్రమంలో గ్రహోపకరణాలకు వినియోగించే 14.2 గ్యాస్ సిలిండర్ పై రూ. 73.08 గా ఉంది. వాటిలో రూ. 39.65 ఎస్టాబ్లిష్ మెంట్ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలు అంతర్లీనం అయి ఉంటాయి. వంట గ్యాస్ వినియోగదారులు డెలివరీ సమయంలో రూపాయి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అదే విధంగా 5 కిలోల చిన్న సిలిండర్ పై డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను రూ. 39.65కు పెంచగా.. అందులో రూ. 19.82 ఎస్టాబ్లిష్ మెంట్ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలు రూ. 16.72 ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)