వెంకటేశ్‌ కుమార్తె నిశ్చితార్ధానికి చిరంజీవి, మహేశ్‌ బాబు హాజరు

Telugu Lo Computer
0

వెంకటేశ్‌- నీరజల రెండో కుమార్తె హవ్యవాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి  వారి స్వగృహంలో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదటి నుంచి వెంకటేశ్‌ సోషల్‌ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. తన ఫ్యామిలీ వ్యవహారాలను ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతాడు. అందుకే ఇప్పుడు తన కూతురి ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని సైతం మీడియాకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అయినప్పటికీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడకు చెందిన డాక్టర్‌ ఫ్యామిలీతో వియ్యం అందుకుంటున్న వెంకటేశ్‌ వచ్చే ఏడాది మార్చిలో కూతురి వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)