సురక్షితమైన పెట్టుబడులకు పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 26 October 2023

సురక్షితమైన పెట్టుబడులకు పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ !


ఇండియన్‌ పోస్టాఫీస్‌ ఎన్నో రకాల పథకాలను తీసుకొచ్చింది. ఇలాంటి వాటిలో పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్ ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల రూ. 9000 ఆదాయాన్ని పొందొచ్చు. సురక్షితమైన పెట్టుబడులకు పోస్టాఫీస్‌ పెట్టింది పేరు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు అందించిన పోస్టాఫీస్‌ ఇప్పుడు బ్యాంకింగ్‌ సేవలను అందిస్తూ, అదిరిపోయే సేవింగ్స్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టాయి. దీంతో పోస్టాఫీస్‌ వైపు ఇటీవల మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పోస్టాఫీస్‌ అందిస్తున్న.. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ పథకం ద్వారా ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని పొందడంతో పాటు, మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుకు కూడా పూర్తి రక్షణ ఉంటుంది. ఈ పథకంలో భాగంగా మీరు 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మంత్లీ సేవింగ్స్‌ స్కీమ్‌లో కనీసం రూ. 1000, గరిష్టంగా ఊ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఒకవేళ జాయింట్‌ ఖాతాను తెరిచినట్లయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ ఖాతాలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు పెట్టుబడి పెట్టొచ్చు. ఇతర బ్యాంకులతో పోల్చితే ఇందులో వడ్డీ రేటు కూడా అధికంగా లభిస్తుంది. ఈ పొదుపు పథకంలో ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నారు. ఇందులో వచ్చిన వడ్డీన నెలనెల తీసుకోవచ్చు. దీంతో పదవి విరమణ తర్వాత క్రమంతప్పకుండా నెలవారీగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. వచ్చిన వడ్డీ మీ సేవింగ్స్‌ ఖాతాలోనే సేవ్‌ అవుతుంది. ఒకవేళ డబ్బు విత్‌డ్రా చేసుకోకపోతే దానిపై కూడా అదనంగా వడ్డీ చేరుతుంది. ఈ పథకంలో భాగంగా మీరు ఒకవేళ నెలకు రూ. 9 వేలు పొందాలనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఈ ఖాతాలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అప్పుడు మీకు ఏడాదికి 7.4 శాతం చొప్పు వడ్డీ లభిస్తుంది. దీంతో వార్షిక వడ్డీ రూ. 1.11 లక్షలు జమ అవుతుంది. ఈ వడ్డీ మొత్తాన్ని 12 నెలల్లో సమానంగా విభజించినట్లయితే మీరు ప్రతి నెల రూ. 9,250 పొందొచ్చు. ఒకవేళ మీరు రూ. 9 లక్షలు పెట్టుబడి పెట్టినట్లైయితే మీకు వార్షికంగా రూ. 66,600 వడ్డీని పొందుతారు. ఈ లెక్కన ప్రతి నెల రూ. 5,500 ఆదాయం పొందొచ్చు. ఈ ఖాతా ఓపెన్‌ చేయాలనుకునే వారు కచ్చితంగా భారతీయులై ఉండాలి. ఇందుకోసం తప్పనిసరిగా పాన్‌కార్డ్‌, ఆధార్‌కార్డ్ ఉండాల్సి ఉంటుంది. దగ్గర్లోని పోస్టాఫీస్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలి. సంబంధిత ఫామ్‌ను ఫిల్‌ చేసి, మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారో మొత్తాన్ని క్యాష్‌ లేదా చెక్‌ రూపంలో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment