తొలిసారిగా భారతీయ రుచులను ఆస్వాదించిన అమెరికన్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 17 October 2023

తొలిసారిగా భారతీయ రుచులను ఆస్వాదించిన అమెరికన్ !


మెరికాకు చెందిన ఓ వ్యక్తి తొలిసారిగా భారతీయ రుచులను ఆస్వాదిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో కెంటుకీలో ఇండియన్ రెస్టారెంట్ ఇండియా ఓవెన్ నుంచి మీల్స్ ఆర్డర్ చేస్తాడు. ఆనియన్ భజియా, బటర్ చికెన్‌, గార్లిక్ నాన్‌, రైస్‌, గులాబ్ జామున్‌ను ఆర్డర్ చేస్తాడు. తన కారులో కూర్చుని ప్రతి డిష్‌ను ఆస్వాదించడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. ఆనియన్ భజియాకు 10కి 8 రేటింగ్ ఇచ్చిన వ్యక్తి గార్లిక్ నాన్ టేస్ట్‌కు 9.5 రేటింగ్ ఇచ్చాడు. బటర్ చికెన్‌కు ఏకంగా 9.9 రేటింగ్ ఇస్తూ ఎంతో టేస్టీగా ఉందని, డివైన్ అంటూ కితాబిచ్చాడు. గులాబ్ జామ్‌తో తన మీల్స్‌ను ముగించాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకూ 3.5 కోట్ల వ్యూస్ వచ్చాయి.

No comments:

Post a Comment