దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు !

Telugu Lo Computer
0


సరా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 620 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు నడపనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. దసరా పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, రాజమండ్రి సహా పలు ప్రాంతాలకు ప్రయాణికులు విపరీతంగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. షిర్డీ, జైపూర్, రామేశ్వరం మరియు ఇతర ప్రధాన రద్దీ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబరు 19 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.అక్టోబర్ 20-29 మధ్య కాకినాడ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)