అణు పరీక్ష ఆపడానికి బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేశాడు !

Telugu Lo Computer
0


1998లో పాకిస్తాన్ అణు పరీక్షలు జరపకుండా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. నాకు కూడా 1 బిలియన్ డాలర్ ఆఫర్ చేయవచ్చేమో, కానీ నేను పాకిస్తాన్ భూమిలో పుట్టాను, అలాంటి పనులు చేయలేదని తెలిపారు. నా స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే, అమెరికా అధ్యక్షుడి ముందు తలవంచేవారని అన్నారు. మేము అణు పరీక్ష నిర్వహించాము, అణు పరీక్షలు నిర్వహించిన భారతదేశానికి తగిన జవాబు ఇచ్చామనని ప్రజలను ఉద్దేశించి అన్నారు. దాదాపు గంటపాటు ఆయన మాట్లాడారు. ఇవన్నీ చేసినందుకు మనం శిక్షించబడతామా..? అని ప్రజలను ప్రశ్నించారు. తన మద్దతుదారులకు ద్రోహం చేయలేదని, ఎలాంటి త్యాగాలకు వెనుకడుగు వేయలేదని నవాజ్ షరీఫ్ అన్నారు. తనపై, తన కూతురుపై, పార్టీ నేతలపై అబద్దపు కేసులు బనాయించారని గుర్తు చేశారు. నవాజ్ షరీఫ్ ను దేశం నుంచి వేరు చేసింది ఎవరో చెప్పండి..? పాకిస్తాన్ నిర్మించింది మనమే, పాకిస్తాన్ ను అణుశక్తిగా మార్చింది మనమే అని ఆయన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విమర్శిస్తూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉందని, పాకిస్తాన్ ని అభివృద్ధి పథంలోకి మళ్లీస్తానని ప్రతిజ్ఞ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)